ETV Bharat / sports

టెస్టు సిరీస్​కు ముందు సరదాగా అలా.. - భారత్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్​

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కు ముందు టీమిండియా ఆటగాళ్లు బ్లూ స్ప్రింగ్స్​ పార్క్​ను సందర్శించారు. అక్కడ పర్యటించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

పుజారా
పుజారా
author img

By

Published : Feb 13, 2020, 4:38 PM IST

Updated : Mar 1, 2020, 5:35 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్​ను వైట్​ వాష్ చేసుకుంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ ఈనెల 21న జరగనుంది. ఈ ఖాళీ సమయంలో భారత ఆటగాళ్లు అలా సరదాగా పర్యటిస్తున్నారు. తాజాగా వీరు న్యూజిలాండ్​లోని బ్లూ స్ప్రింగ్స్​ పార్క్​ను సందర్శించారు. అక్కడ దిగిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోల్లో కీపర్ వృద్ధిమాన్ సాహా, పుజారా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్​లతో పాటు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, శుభమన్ గిల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ కనిపించారు.

రేపటి (శుక్రవారం) నుంచి టీమిండియా న్యూజిలాండ్ ఎలెవన్​తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్​ షిప్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన ఈ సిరీస్​లోనూ గెలిచి సత్తాచాటాలని భావిస్తోంది.

Last Updated : Mar 1, 2020, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.