బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీనే బాధ్యతలు తీసుకుంటున్నట్లు దాదాపు ఖరారైంది . అయితే తుది ఫలితం కోసం సోమవారం మధ్యాహ్నం 3 గంటలు వరకు ఎదురు చూడాలని చెప్పాడు దాదా. అయితే ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నాడు.
"ఇదో గొప్ప అవకాశంగా భావిస్తా. సవాల్‌గా తీసుకుని పని చేస్తా. ఇది చాలా పెద్ద బాధ్యత. దేశవాళీ క్రికెటర్లకే నా మొదటి ప్రాధాన్యత ఇస్తా. ముఖ్యంగా రంజీలపై దృష్టి పెడతా. ఆర్థికంగా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తా" -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్
అయితే ఈ రెండింటిలో టీమిండియా సారథిగా ఉండడమే పెద్ద బాధ్యతని చెప్పాడు గంగూలీ.
"ఎన్ని పదవులున్నా.. టీమిండియా కెప్టెన్‌గా ఉండటమే ఉన్నతంగా భావిస్తున్నా. బీసీసీఐ అధ్యక్షుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ పదవి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా" -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్.
అధ్యక్ష పదవికి మాజీ ఆటగాడు బ్రిజేష్ పటేల్ పేరు వినిపించినప్పటికీ సౌరభ్కే పగ్గాలు దక్కనున్నాయి. బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్ ధూమల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ!