ETV Bharat / sports

'భారత జెర్సీలో కనిపిస్తాననే నమ్మకంతో ఉన్నా' - టీ20 ప్రపంచకప్​ జట్టులోకి వస్తా దినేశ్ కార్తీక్

టీమ్​ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్. మళ్లీ భారత జట్టు జెర్సీ ధరిస్తాననే నమ్మకంతో ఉన్నట్లు చెప్పాడు.

కార్తీక్
కార్తీక్
author img

By

Published : Apr 17, 2020, 6:40 AM IST

టీమ్​ఇండియా వికెట్​కీపర్, బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్ తన రీఎంట్రీపై నమ్మకంతో ఉన్నాడు. పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆటగాడు.. త్వరలోనే పునరాగమనం చేస్తానని అంటున్నాడు. అయితే ప్రపంచకప్​ గురించి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉందని చెప్పాడు.

" పొట్టి ఫార్మాట్​లో నా రికార్డు బాగుంది. టీ20 ప్రపంచకప్​న​కు సంబంధించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. కానీ నా ఆశల్ని ఇంకా వదులుకోలేదు. నా ప్రదర్శనపై నమ్మకంతో ఉన్నప్పుడు స్థానంపై అనుమానం ఎందుకు? ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేశా."

-దినేశ్ కార్తీక్, టీమ్​ఇండియా క్రికెటర్

తనకు ఇప్పటికీ దేశం కోసం ఆడాలని ఉందన్నాడు కార్తీక్. జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు.

"మూడు ఫార్మాట్లలో నా సగటు చూసుకుంటే టీ20ల్లోనే బాగుంది. అలానే స్టైక్‌రేట్‌ కూడా మెరుగ్గా ఉంది. నేను ఎప్పుడూ దేశం కోసం ఆడాలనే కోరికతోనే ఉన్నా. అది ఒక్కసారిగా తగ్గిపోదు కదా. నా కెరీర్​లో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. జట్టు నుంచి తప్పించడం నాకు చాలా పాఠాలు నేర్పింది."

-దినేశ్ కార్తీక్, టీమ్​ఇండియా క్రికెటర్

ఇప్పటివరకు దినేశ్‌ కార్తీక్‌.. 26 టెస్టులు, 94 వన్డేలు ఆడాడు. 32 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. పొట్టి ఫార్మాట్​లో కార్తీక్‌ సగటు 33 ఉండగా.. స్టైక్‌రేట్ 143.52గా నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.