ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు ఘనస్వాగతం లభించింది. ఇందులో భాగంగానే రోహిత్, రహానె, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా.. ముంబయికి చేరుకున్నారు. అయితే ఈ క్రికెటర్స్ కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
అంతకముందు సాధారణంగా విదేశాల నుంచి ముంబయి వచ్చిన వారు.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుని తప్పనిసరిగా క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. అయితే భారత ఆటగాళ్లు నగరానికి వచ్చే ముందు ఆస్ట్రేలియా పర్యటనలో బయోబుడగలో ఉన్నారు. వీరికి వైరస్ ఫలితాలు నెగటివ్‌గా తేలాయి. కాబ్టటి వీరికి నిబంధనలు అవసరం లేదని స్పష్టం చేసింది ముంబయి కార్పొరేషన్.
ఇదీ చూడండి : 'ఆ ముద్దులే నా గాయాలకు మందులు'