ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైట్‌వాష్ అవుతుందని జోస్యం చెప్పాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా. తొలి టెస్టులో ఓడిన టీమ్ఇండియా తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకం లేదని చెప్పాడు. రెండో టెస్టు నుంచి పితృత్వ సెలవులతో టీమ్ఇండియా సారథి కోహ్లీ గైర్హాజరీ తమకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. 4-0తో టెస్టు సిరీస్‌ను తాము సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
"తొలి టెస్టు పరాజయం నుంచి భారత్ కోలుకోగలదని నేను అనుకోను. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. కానీ మూడు రోజుల్లోనే వారు ఓడిపోయారు. కాబట్టి ఆసీస్ చేతిలో భారత జట్టు వైట్‌వాష్ అవుతుంది."
-మార్క్ వా, ఆసీస్ మాజీ క్రికెటర్.
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై విమర్శలను ఎదుర్కొంటోంది. మెల్బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి.
ఇదీ చూడండి : స్మిత్‌కు కెప్టెన్సీ.. ఆసీస్ బోర్డు ఏమంటోంది?