ETV Bharat / sports

కరోనా కాలంలో క్రికెట్ మ్యాచ్​ ఇలా ఉంటుంది! - కరీబియన్​ దీవుల్లోని సెయింట్​ విన్సెంట్

దాదాపు రెండు నెలల కరోనా విరామం తర్వాత తొలి క్రికెట్ టోర్నమెంట్​ ప్రారంభమైంది. కరీబియన్​ దీవుల్లోని సెయింట్​ విన్సెంట్​ సిటీలో విన్సీ టీ10 టోర్నమెంట్​ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రేక్షకులకు అనుమతి నిరాకరించడం సహా క్రికెటర్లకు పలు మార్గనిర్దేశకాలను జారీ చేశారు నిర్వాహకులు.

No fans, no saliva, hand sanitisers on boundary: Welcome to a new-look T10 cricket
మాస్క్​లతో అంపైర్లు.. శానిటైజర్లతో ఆటగాళ్లు
author img

By

Published : May 24, 2020, 1:02 PM IST

కరోనా తర్వాత కరీబియన్​ దీవుల్లో కింగ్​స్టన్​ వేదికగా క్రికెట్​ వేడుక ప్రారంభమైంది. విన్సీ టీ10 క్రికెట్​ లీగ్​లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో బంతి మెరుపు కోసం లాలాజలం వాడటం, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం నిషేధించారు. అంతర్జాతీయ క్రికెట్​లో ఇది చిన్న టోర్నీ అయినప్పటికీ.. కరోనా వైరస్​ మహమ్మారి తర్వాత మైదానంలో ప్రారంభమైన తొలి క్రికెట్ టోర్నమెంట్​ ఇదే.

No fans, no saliva, hand sanitisers on boundary: Welcome to a new-look T10 cricket
చేతికి శానిటైజర్​ రాసుకుంటున్న క్రికెటర్​

"స్టేడియానికి 300 నుంచి 500 మంది ప్రేక్షకులను అనుమతించాలని తొలుత అనుకున్నాం. కానీ, కొంతమంది నిపుణుల సలహాతో ప్రేక్షకులను అనుమతించొద్దని నిర్ణయించాం. ప్రేక్షకుల భావోద్వేగాలు మేము అర్థం చేసుకోగలను. కానీ, ఆరోగ్య భద్రత కోసం ప్రజలు సమూహంగా చేరడాన్ని ప్రోత్సహించలేం". - కిషోర్​ షాలో, అసోసియేషన్​ ప్రెసిడెంట్​

ఈ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లంతా కొన్ని నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని అసోసియేషన్​ ఆదేశించింది. బంతికి లాలాజలాన్ని వాడటం, వికెట్ పడితే సామూహిక సంబరాలు చేసుకోవటం పూర్తిగా నిషేధం. బౌండరీ లైన్ల వద్ద శానిటైజర్లతో సహా ఆటగాళ్లకు థర్మల్​ చెకింగ్​ పరికరాలను అందుబాటులో ఉంచారు. అంపైర్లు మాస్క్​లు ధరించి మైదానంలో అడుగుపెట్టారు.

ఇదీ చూడండి... 'జురాసిక్ వరల్డ్​'లో కోహ్లీ.. టీజర్ విడుదల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.