న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అరుదైన గౌరవం లభించింది. 2019 ప్రపంచకప్లో క్రీడా స్ఫూర్తీతో ఆడినందుకు గాను మారీల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ) క్రిస్టోఫర్ మార్టిన్ జెన్కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2019 పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎమ్సీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర తెలియజేశాడు.
"న్యూజిలాండ్ ఈ అవార్డుకు అర్హతగల జట్టు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఓడినప్పటికీ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించారు కివీస్ ఆటగాళ్లు. టోర్నీ ఆద్యంతం వారు అలాగే ప్రవర్తించారు. తుదిపోరులో వారు చూపిన అణకువ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం" -కుమార సంగక్కర, ఎమ్సీసీ అధ్యక్షుడు
జులై 14న లార్డ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు ఎంతో ఉదారంగా వ్యవహరించింది. ముఖ్యంగా కెప్టెన్ విలయమ్సన్ తమ జట్టు ఓడినప్పటికీ క్రీడాస్ఫూర్తి, అణకువతో హుందాగా ప్రవర్తించాడు.
ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ నిర్వహించగా అందులోనూ స్కోర్లు సమమయ్యాయి. బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లీష్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు.
ఇదీ చదవండి: 1500 మీటర్ల పరుగులో భారత్కు 4 మెడల్స్