ETV Bharat / sports

న్యూజిలాండ్​లో ఐపీఎల్​ ఊహాగానాలు మాత్రమే! - ఐపీఎల్​ నిర్వహణ

ఐపీఎల్​ను తాము ఆతిథ్యమిచ్చేందుకు ఎటువంటి ఆసక్తి చూపలేదని స్పష్టం చేశారు న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డు ప్రతినిధి. ఇటీవల వస్తోన్న వార్తలన్నీ ఊహాగానాలేనని అన్నారు.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Jul 9, 2020, 12:45 PM IST

Updated : Jul 9, 2020, 1:54 PM IST

ఐపీఎల్​ను తమ దేశంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమని తెలిపారు న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డు ప్రతినిధి. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని అన్నారు. ఈ మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వడానికి ఎటువంటి ఆసక్తి చూపలేదని స్పష్టం చేశారు.

భారత్​లో​ కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఐపీఎల్​ను విదేశీ గడ్డపై నిర్వహించొచ్చనే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి అన్నారు. యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్​ దేశాలు ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించారు.

ఐసీసీ నిర్ణయం తర్వాతే

అయితే భారత్​లోనే ఈ టోర్నీ జరపడం తమ తొలి ప్రాధాన్యమని తాజాగా స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

కరోనా వల్ల ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు​-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే జరపలేమని ఆసీస్ బోర్డు సంకేతాలు ఇచ్చినా సరే, అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించలేదు. అయితే ఐసీసీ, దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐపీఎల్​ నిర్వహణ తేదీ ప్రకటిస్తామని తెలిపారు గంగూలీ.

ఇది చూడండి : కివీస్ మహిళా జట్టుకు కెప్టెన్​గా సోఫీ డివైన్​

Last Updated : Jul 9, 2020, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.