ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 176 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి ఎగబాకింది. విలియమ్సన్(238) ద్విశతకంతో ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. జెమీసన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో రెండు ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
![New Zealand become number one team for the first time in history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10135593_pak-vs-nz-1.jpg)
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(238), హెన్రీ నికోలస్(157), డారీ మిచెల్(102) అసాధారణమైన బ్యాటింగ్‌తో జట్టుకు స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 659 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ విలియమ్సన్ సేన డిక్లేర్డ్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. 186 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.
ఇది చదవండి: రెండో టెస్టులో కరోనా.. మూడో మ్యాచ్‌లో మాస్క్ తప్పనిసరి