ETV Bharat / sports

నట్టు అరంగేట్రంపై వార్నర్​ ఆసక్తికర వ్యాఖ్యలు - టీమ్​ఇండియా టెస్టు జట్టు

టెస్టుల్లో నటరాజన్ అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేశాడు సన్​రైజర్స్​ జట్టులోని అతడి సహచరుడు డేవిడ్​ వార్నర్. నట్టూకు నైపుణ్యం ఉన్నా సరే క్రమం తప్పకుండా దానిని అమలు చేస్తాడనే విషయాన్ని నమ్మకంగా చెప్పలేనని అన్నాడు.

Natarajan has skills to succeed but not sure whether he can do it regularly in Tests, says Warner
టెస్టుల్లో నట్టు అరంగేట్రంపై వార్నర్​ ఆసక్తికర వ్యాఖ్యలు
author img

By

Published : Jan 2, 2021, 1:12 PM IST

యువ బౌలర్ నటరాజన్​.. టెస్టుల్లో భారత తుదిజట్టుకు ఎంపికవడంపై ఆసీస్​ క్రికెటర్ వార్నర్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఫార్మాట్​లో స్థిరంగా లైన్​, లెంగ్త్​తో బౌలింగ్​ చేస్తాడనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని అన్నాడు. వీరిద్దరూ ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడుతున్నారు. టీ20ల్లో మ్యాజిక్​ను నట్టు మళ్లీ రిపీట్​ చేస్తాడా అన్న ప్రశ్నకు వార్నర్​ ఈ విధంగా స్పందించాడు.

Natarajan has skills to succeed but not sure whether he can do it regularly in Tests, says Warner
టెస్టుల్లో నట్టు అరంగేట్రంపై వార్నర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

"అతడికి మంచి లైన్​, లెంగ్త్​ ఉన్నాయి. కానీ టెస్టుల్లో వరుస ఓవర్లలో బిగి కొనసాగిస్తాడని కచ్చితంగా చెప్పలేను. సిరాజ్​ లాగే నట్టు కూడా తన అరంగేట్రాన్ని విజయవంతం చేసుకుంటాడని నమ్మతున్నా. బిడ్డ పుట్టినా వెళ్లకుండా నెట్​ బౌలర్​గా వచ్చి, తుది జట్టులో చోటు సంపాదించడం గొప్ప విషయం. అతడికి అభినందనలు. మంచి బౌలర్. అవకాశం వస్తే ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతడికి బాగా తెలుసు" -డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్

ఉమేశ్​ యాదవ్​కు గాయం కావడం వల్ల ఆసీస్​తో చివరి రెండు టెస్టులకు నటరాజన్ ఎంపికయ్యాడు. జనవరి 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: మూడో టెస్టులో ఆడటంపై వార్నర్ స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.