వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటికే నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించిది. ఇప్పుడు నమీబియా.. ఆ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుంది. ఒమన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఈ మెగాటోర్నీకి క్వాలిఫై అయింది.
-
Namibia, welcome to 'The Big Dance'!@T20WorldCup | #NAMvOMA pic.twitter.com/oKqsVFlMVo
— ICC (@ICC) October 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Namibia, welcome to 'The Big Dance'!@T20WorldCup | #NAMvOMA pic.twitter.com/oKqsVFlMVo
— ICC (@ICC) October 29, 2019Namibia, welcome to 'The Big Dance'!@T20WorldCup | #NAMvOMA pic.twitter.com/oKqsVFlMVo
— ICC (@ICC) October 29, 2019
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది నమీబియా. ఆల్‌రౌండర్ జేజే స్మిత్ 25 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 162 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన ఒమన్.. 107 పరుగులకే ఆలౌట్ అయింది. ఇటీవలే ఐర్లాండ్, పుపువా న్యూగినియా జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబరు 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో సహా మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.
ఇదీ చదవండి: డే అండ్ నైట్ టెస్టులో విజయం మాదే: బంగ్లా కోచ్