ETV Bharat / sports

క్వారంటైన్​పై ముంబయి, కోల్​కతా అసంతృప్తి

ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లిన ముంబయి ఇండియన్స్, కోల్​కతా నైట్​రైడర్స్ జట్లు అసంతృప్తితో ఉన్నాయి. అదనంగా మరో వారం రోజులు క్వారంటైన్​లో ఉండాల్సి రావడమే ఇందుకు కారణం.

క్వారంటైన్​పై ముంబయి, కోల్​కతా అసంతృప్తి
క్వారంటైన్​పై ముంబయి, కోల్​కతా అసంతృప్తి
author img

By

Published : Aug 28, 2020, 7:23 AM IST

ఐపీఎల్‌ కోసం యూఏఈ వెళ్లిన జట్లు ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అసంతృప్తితో ఉన్నాయి. అదనంగా మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడమే అందుకు కారణం. ఈ రెండు అబుదాబి కేంద్రంగా ఉంటూ టోర్నీలో ఆడనున్నాయి. అయితే అక్కడి నిబంధనల ప్రకారం ఎవరైనా బయటకెళ్లాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. అదే దుబాయ్‌ కేంద్రంగా ఉండే ఆరు ఐపీఎల్‌ జట్లకు మాత్రం క్వారంటైన్‌ ఏడు రోజులే.

"ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బీసీసీఐని కోరాం. క్వారంటైన్‌ ఏడు రోజులే అని ముందు మాకు చెప్పారు. కానీ స్థానిక నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ 14 రోజులని మాకు ఇప్పుడు తెలిసింది" అని ముంబయి ఇండియన్స్‌కు చెందిన ఓ అధికారి చెప్పాడు.

కోల్‌కతా జట్టు ఆగస్టు 20న, ముంబయి 21న యూఏఈ చేరుకున్నాయి. అదే సమయంలో దుబాయ్‌ చేరుకున్న ఆరు జట్లలో కొన్ని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. కానీ ముంబయి, కోల్‌కతా ఆటగాళ్లు మరో వారం రోజులు హోటళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.

అందుకే షెడ్యూలు ఆలస్యం..

రెండు ఎమిరేట్స్‌లో భిన్నమైన కొవిడ్‌-19 నిబంధనలు ఉండడం బీసీసీఐకి కూడా ఇబ్బందికరంగా మారింది. ఐపీఎల్‌ షెడ్యూలు ప్రకటించకపోవడానికి కారణం అదే. అబుదాబి, దుబాయ్‌ల మధ్య ప్రయాణ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎవరైనా దుబాయ్‌లో అడుగుపెట్టాలంటే ర్యాపిడ్‌ పరీక్షలు తప్పనిసరి. నెగిటివ్‌ వస్తేనే సరిహద్దు దాటనిస్తారు. మ్యాచ్‌ జరిగే రోజు అలాంటి కఠిన ప్రక్రియతో ఐపీఎల్‌ జట్లకు చాలా ఇబ్బందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు దశలుగా టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం దుబాయ్‌లో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దుబాయ్‌ నుంచి షార్జా వెళ్లడానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. దీంతో దుబాయ్‌, షార్జాలో తొలి దశ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.