ముంబయి ఇండియన్స్‌కు దాదాపు 12 ఏళ్ల పాటు ఆడిన పేసర్ లసిత్ మలింగ.. ఫ్రాంచైజీ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. అందుకే అతడిని ఈ ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకోలేదని ముంబయి మేనేజ్మెంట్ వెల్లడించింది. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపింది.
"మలింగ ముంబయి ఇండియన్స్ లెజెండ్. జట్టుకు అతడి చేసిన సేవలు వెలకట్టలేనివి. అయితే మా అభిమానుల గుండెల్లో అతడు ఎప్పటికీ ఉంటాడు. ముంబయి జట్టులో మలింగ ఎప్పటికీ భాగమే. అతడి క్రికెట్ అనుభవం మాకు అందిస్తారని అనుకుంటున్నాం" అని ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ చెప్పారు.
"కుటుంబంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కరోనా పరిస్థితుల వల్ల ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం నా వరకు చాలా కష్టమని భావించాను. అందుకే వీడ్కోలు పలకాలని భావించాను. ఇదే విషయాన్ని ముంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్కు చెప్తే వారు సానుకూలంగా స్పందించి నాకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు చెబుతున్నాను" అని మలింగ చెప్పాడు.
ఇది చదవండి: ఐపీఎల్: స్టార్ క్రికెటర్లను వదులుకున్న ఆ జట్లు