టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ ప్రశంసలు కురిపించాడు. తన ఆటతో భారత్‌లోని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో ఒకడిగా ఎప్పటికీ నిలిచిపోతాడని అభిప్రాయపడ్డాడు.
"మహేంద్రసింగ్ ధోనీ కూల్ కెప్టెన్. 14 నెలలుగా అతడు క్రికెట్ ఆడలేదు. అయినా సరే చెన్నై సూపర్‌కింగ్స్ శిక్షణా శిబిరంలో ఉంటూ, సహచర ఆటగాళ్లకు నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణను నేర్పిస్తున్నాడు. ఎందుకంటే తాను ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. సారథిగా అతడి వ్యూహాలు చాలా దూరపు ఆలోచనతో ఉంటాయి. మహీ ఆటను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తన ఉత్తమ ప్రదర్శనలతో టీమ్ఇండియా అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో ఎప్పటికీ నిలిచిపోతాడు"
- డీన్ జాన్స్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ కోసం యూఏఈకి బయలుదేరే ముందు సీఎస్కే శిబిరంలో చేరిన ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రాక్టీసులో బాగా ఆడుతున్నాడని, జట్టు యాజమాన్యం ఈ మధ్య కొన్ని సందర్భాల్లో తెలియజేసింది.