ETV Bharat / sports

నెట్టింట ధోనీ లుక్.. అభిమానుల సంతోషం - MS Dhoni Is Back? Chennai Super Kings Share Thalas Picture While Watching New Ipl Ad

వచ్చే నెలలో ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం టీమిండియా మాజీ సారథి ధోనీ కసరత్తులు ప్రారంభించాడు. తాజాగా ఇతడికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చెన్నై ఫ్రాంఛైజీ.

ధోనీ
ధోనీ
author img

By

Published : Feb 24, 2020, 12:51 PM IST

Updated : Mar 2, 2020, 9:32 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ ఫొటోను చెన్నై ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. అందులో మహీ టీవీలో తమ ఫ్రాంచైజీ కొత్త ప్రకటన చూస్తూ కనిపించాడు.

ధోనీ.. 9 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. గతేడాది ప్రపంచకప్​ సెమీస్​​ తర్వాత మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఫలితంగా అతడి రిటైర్మెంట్​పై చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినా పెదవి విప్పలేదు మహీ.

ప్రపంచకప్​ అనంతరం సైన్యంలో పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత వివిధ ప్రైవేట్​ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో సత్తాచాటితే టీ20 ప్రపంచకప్​ కోసం అతడి పేరును పరిగణలోకి తీసుకుంటామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి గతంలోనే చెప్పాడు.

Last Updated : Mar 2, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.