ETV Bharat / sports

'ధోనీకి పట్టుపోయింది.. ఆడలేకపోతున్నాడు'

author img

By

Published : Apr 8, 2020, 12:02 PM IST

భారత జట్టు మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీకి పబ్​జీ ఆటపై పట్టు పోయిందన్నాడు బౌలర్​ దీపక్​ చాహర్​. చెన్నై సూపర్​కింగ్స్​ తాజాగా ట్విట్టర్​లో ఓ వీడియోను షేర్​ చేసింది. అందులో అతడు ఇప్పటికీ పబ్​జీ ఆడుతున్నట్లు తెలిపాడు.

MS Dhoni Has Lost Touch Cant Play PubG That Well Now Reveals Deepak Chahar
'ధోనికి పట్టుపోయింది.. ఆడలేకపోతున్నాడు'

టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి పబ్‌జీ గేమ్‌పై టచ్‌ పోయిందని భారత బౌలర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌.. దీపక్‌ చాహర్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. రెండు ఆప్షన్స్‌ ఇచ్చి ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలని కోరింది. ఆ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. గేమ్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ లేదా పబ్‌జీ? అనే ప్రశ్నకు చాహర్‌ ఇలా బదులిచ్చాడు.

"పబ్‌జీ. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. కానీ ధోనీ ఆడట్లేదు. పబ్‌జీపై అతడికి పట్టు పోయింది. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు. అతడు ఇప్పుడు మరో గేమ్‌ ఆడుతున్నాడు. కాల్‌ ఆఫ్‌ డ్యూటీతో బిజీగా ఉంటున్నాడు" అని చాహర్‌ సరదాగా బదులిచ్చాడు. ధోనీ, చాహర్‌ ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

MS Dhoni Has Lost Touch Cant Play PubG That Well Now Reveals Deepak Chahar
దీపక్​ చాహర్​, మహేంద్రసింగ్​ ధోని

ఇదీ చూడండి.. 'యువ క్రికెటర్లు సీనియర్లను చూసి నేర్చుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.