ETV Bharat / sports

మోతెరాలో సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్ మ్యాచ్​లు - జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ

కరోనా ప్రభావంతో వాయిదాపడిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జనవరి 10న ప్రారంభంకానుంది. అహ్మదాబాద్​లో నాకౌట్​ మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

Motera among six host venues for the Syed Mushtaq Ali Trophy
మొతేరాలో సయ్యద్ అలీ టోర్నీ నాకౌట్ మ్యాచ్​లు
author img

By

Published : Dec 17, 2020, 10:45 AM IST

కరోనా ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను నిర్వహించని బీసీసీఐ.. వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక జట్టు జమ్మూ కశ్మీర్​తో తలపడనుంది.

బెంగళూరు, కోల్​కతా, వడోదరా, ఇండోర్​తో పాటు ముంబయి ఈ మ్యాచ్​లకు వేదికలుగా నిలవనున్నాయి. అహ్మదాబాద్​లోని కొత్త మైదానం మోతెరా నాకౌట్ మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 29న సెమీస్, 31న ఫైనల్స్ జరగనున్నాయి.

ఈ టోర్నీ కోసం జనవరి 2,4,6 తేదీల్లో మూడు విడతలుగా ఆటగాళ్లతో పాటు సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఇందులో నెగిటివ్ వచ్చిన వారు జనవరి 8న నుంచి ప్రాక్టీస్ సెషన్స్​లో పాల్గొంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.