ETV Bharat / sports

ఐపీఎల్ వాయిదా వేయడం మంచిదే: గావస్కర్ - ఐపీఎల్ వాయిదాపై గావస్కర్ మాట

ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్​​ను వాయిదా వేయడం మంచి విషయమని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. ఈ నిర్ణయం అభినందించదగ్గదని అభిప్రాయపడ్డాడు.

గావస్కర్
గావస్కర్
author img

By

Published : Mar 14, 2020, 2:33 PM IST

కరోనా ప్రభావం వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడింది. ఫలితంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఐపీఎల్​ను వాయిదా వేసి బీసీసీఐ మంచి పనే చేసిందని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.

"ఇది చాలా మంచి నిర్ణయం. బీసీసీఐకి అభినందనలు. ఎందుకంటే దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం. కరోనా వైరస్‌ వ్యాపిస్తుండడం వల్ల ఈ నిర్ణయం ఎంతో ముఖ్యం. ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది వస్తారు. హోటల్స్‌లో, ఎయిర్‌పోర్టుల్లో అనేక మంది ఉంటారు. చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. కాబట్టి, ఎవరైనా వైరస్‌ బారిన పడొచ్చు. వాళ్ల నుంచి ఇతరులకు వ్యాపించొచ్చు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గది"

-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండా జరపొచ్చు కదా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు గావస్కర్. అలా చేసినా, ఏ ఆటగాడూ ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడాలనుకోడని అన్నాడు. ఆటగాళ్లు ఉత్సాహంగా ఉండాలంటే ప్రేక్షకులు కచ్చితంగా ఉండాలని, అలా లేకపోతే టోర్నీ నిర్వహించడంలో అర్థం లేదని గావస్కర్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.