భారత్-బంగ్లాదేశ్ మొదటి టెస్టు తొలిరోజున టీమిండియా ఆధిపత్యం వహించింది. భారత బౌలర్లు ధాటికి 150 పరుగలకే ఆలౌటైంది బంగ్లా. షమి.. మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్లోనూ హ్యాట్రిక్ గురించే ఆలోచించానని అన్నాడు.
"భారత్ తరఫున వికెట్ తీస్తే అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది. బౌలర్లు, బ్యాట్స్మెన్ ఎవరు బాగా ఆడినా.. మేమంతా ఎంజాయ్ చేస్తాం. టీ బ్రేక్ సమయంలో హ్యాట్రిక్ గురించే ఆలోచించా."
-షమి, టీమిండియా బౌలర్
తొలి రోజు టీ విరామానికి ముందు ఓవర్లో వరుసగా ముష్ఫీకర్ రహీం, మెహదీ హాసన్ వికెట్లను తీశాడు షమి. ఫలితంగా హ్యాట్రిక్ వికెట్లు అతడి మదిలో నిలిచాయి. కానీ అది సాధ్యం కాలేదు. మొత్తంగా ఈ మ్యాచ్లో 13 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
ఇవీ చూడండి.. పాక్లో టెస్టు సిరీస్.. నిరీక్షణ ఫలించిన వేళ