లాహోర్లో శనివారం.. పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించింది లంక. సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. పాక్ ఆటగాడు మహ్మద్ హస్నేన్.. ఈ మ్యాచ్లో ప్రపంచ రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
టీ20 క్రికెట్లో అతి తక్కువ వయసులో హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్గా ఘనత సాధించాడు. ఇతడి వయసు 19 ఏళ్ల 183 రోజులు. భనుక రాజపక్సే (32), శనక (17), షెహాన్ జయసూర్య (2) వికెట్లు తీయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు.
తొలుత బ్యాటింగ్ దిగిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఓపెనర్ గుణతిలక అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన పాక్.. 101 పరుగులకే ఆలౌటైంది. నువాన్ ప్రదీప్, ఉదానా చెరో మూడు వికెట్లు ప్రత్యర్థిని దెబ్బతీశారు.
ఇవీ చూడండి.. ముగిసిన ఎన్బీఏ సంబరం.. పేసర్స్ జయకేతనం