పాకిస్థాన్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 27 ఏళ్ల వయసులో అత్యుత్తమైన ఈ ఫార్మాట్‌కు టాటా చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-
To me Mohammad Amir retiring from Test cricket is a bit surprising because you peak at 27-28 and Test cricket is where you are judged against the best, it’s the ultimate format. Pakistan will need him in two Tests in Australia and then three in England.
— Wasim Akram (@wasimakramlive) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">To me Mohammad Amir retiring from Test cricket is a bit surprising because you peak at 27-28 and Test cricket is where you are judged against the best, it’s the ultimate format. Pakistan will need him in two Tests in Australia and then three in England.
— Wasim Akram (@wasimakramlive) July 26, 2019To me Mohammad Amir retiring from Test cricket is a bit surprising because you peak at 27-28 and Test cricket is where you are judged against the best, it’s the ultimate format. Pakistan will need him in two Tests in Australia and then three in England.
— Wasim Akram (@wasimakramlive) July 26, 2019
"టెస్ట్ క్రికెట్‌కు ఆమిర్ వీడ్కోలు పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే 27 ఏళ్ల వయసులో నీ ప్రతిభను నిరూపించుకోవడానికి టెస్టు మ్యాచ్‌లే అత్యుత్తుమం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో పాక్ జట్టుకు నీ సేవలు అవసరం".
-వసీం అక్రమ్, పాక్ మాజీ పేసర్
పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్... ఆమిర్ రిటైర్మెంట్పై స్పందించాడు. ఇంత చిన్న వయసులో టెస్టులకు వీడ్కోలు పలకవలసిన అవసరం ఏముందంటూ మండిపడ్డాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతావా. ఇప్పటికే టెస్టుల్లో పాకిస్థాన్ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. ఇటువంటి సమయంలో దేశానికి నువ్వు ఇచ్చేది ఇదేనా. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో నువ్వు చిక్కుకున‍్నప్పుడు పాక్ బోర్డు చాలా ఖర్చు పెట్టింది. కోలుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చావు. ఇపుడు ఈ నిర్ణయం సరైనదేనా.? మిగతా క్రికెటర్లూ నీలాగే ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అసలు పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది. దీనిపై పీసీబీ దృష్టి సారించాలి".
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ బౌలర్
స్పాట్ ఫిక్సింగ్ తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఆమిర్.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లోనూ సత్తాచాటాడు. ఈ సమయంలో అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇవీ చూడండి.. రాయ్ 'షూ' ఊడింది- స్టేడియం నవ్వులమయమైంది