సెలబ్రిటీలను విమర్శిస్తూ, ట్రోలింగ్ చేస్తూ నెట్టింట హైలైట్ అవుదామని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సంఘటనే టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ఎదురైంది. అయితే సామాజిక మాధ్యమాల్లో తనను ఇబ్బంది పెడుతున్న ఓ నెటిజన్‌కు గట్టి సమాధానమిచ్చింది.
ఏం జరిగిందంటే..!
ఇటీవల దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో వన్డే సిరీస్ గెలిచారు టీమిండియా మహిళలు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్... మిథాలీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్విటర్‌లో అభినందనలు చెప్పాడు. అందుకు మిథాలీ స్పందించింది.
"చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్రికెట్ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉంది" అంటూ ఓ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ మిథాలీపై విమర్శలు చేసింది.
"మిథాలీరాజ్ మాతృభాష తమిళం అయినా ఎప్పుడూ ఆ భాష మాట్లాడదు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుంది" అని ట్రోల్ చేసింది. అంతేకాకుండా మిథాలీకి అసలు మాతృభాష రాదని ఎద్దేవా చేసింది.
-
Also, I would like to dedicate @vasugi29 a very famous song by a strong independent woman I admire a lot . Enjoy :) https://t.co/o34CtfCZCB
— Mithali Raj (@M_Raj03) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Also, I would like to dedicate @vasugi29 a very famous song by a strong independent woman I admire a lot . Enjoy :) https://t.co/o34CtfCZCB
— Mithali Raj (@M_Raj03) October 15, 2019Also, I would like to dedicate @vasugi29 a very famous song by a strong independent woman I admire a lot . Enjoy :) https://t.co/o34CtfCZCB
— Mithali Raj (@M_Raj03) October 15, 2019
కౌంటర్ పడినట్లే..
టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ.. ఆ నెటిజన్‌కు సమాధానమిస్తూ... "నా మాతృభాష తమిళమే. నేను ఈ భాష బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవిస్తున్నందుకు గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవప్రద భారతీయురాలిగా ఉంటా. నా ప్రతి పోస్టుకు స్పందించే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా" అని జవాబిచ్చింది. ఈ సందర్భంగా ఆ నెటిజన్‌కు టేలర్ స్విఫ్ట్ పాటనూ షేర్ చేసింది మిథాలి.
ఈ స్టార్ క్రీడాకారిణికి అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. "మిథాలీ కౌంటర్‌కు నెటిజన్ బౌండరీ అవతల పడింది" అని, విమర్శలు చేసిన నెటిజన్‌పై మండిపడుతున్నారు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది మిథాలీ రాజ్. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేతో ఈ మైలురాయిని చేరుకుంది. 1999 జూన్ 26న మిథాలీ.. ఐర్లాండ్‌పై వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. 20 ఏళ్ల కెరీర్లో 204 వన్డేలు, 10 టెస్టులు, 89 టీ20లు ఆడింది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీనే. ఆమె టీ20లకు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించింది.