ఐపీఎల్‌ను ఈ ఏడాది నిర్వహించే విషయమై పలు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ వాయిదా పడనున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో టోర్నీ నిర్వహించబోతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయానికి ఆస్ట్రేలియాలో దేశవాళీ క్రికెట్ లీగ్ మొదలైతే ఆ రెండింటిలో కంగారూ ఆటగాళ్లు ఏది ఎంచుకుంటారనేది అందరి మనసును తొలుస్తున్న ప్రశ్న. ఈ విషయమై తాజాగా మాట్లాడాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. ఏ టోర్నీలో ఆడాలో క్రికెటర్ల వ్యక్తిగత విషయమని.. అది వారి కాంట్రాక్ట్‌లపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
"అవన్నీ ముందుగా అంగీకరించిన కాంట్రాక్ట్‌లు. దానితో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు వెళ్లాలి అనుకుంటే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి తీసుకోవాలి. అది పెద్ద సమస్యగా మారుతుందని అనుకోవడం లేదు. ముందుగా అంగీకరించిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి. ఇది ఆసక్తికర అంశమే అయినా.. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారే తీసుకోవాలి"
- మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా మాజీ పేసర్
స్టార్క్ ప్రస్తుతం ఎలాంటి ఐపీఎల్ కాంట్రాక్ట్‌లో లేడు. 2018 ఐపీఎల్లో కోల్‌కతా నైట్రైజర్స్ అతడిని వేలంలో కొనుగోలు చేయగా.. గాయల కారణంగా రెండేళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం తాను ఎలాంటి కాంట్రాక్ట్‌లో లేని కారణంగా ఈ విషయంలో తాను ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి... టాప్ ఎక్సర్సైజ్ను పర్ఫెక్ట్గా చేసిన కోహ్లీ