అలిస్సా హెలే - మిచెల్ స్టార్క్.. భార్యాభర్తలైన ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం యాషెస్ నాలుగో టెస్టులో ఓ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు స్టార్క్. అదే సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన మహిళల రెండో వన్డేలో ఫోర్ కొట్టింది అలిస్సా. ఇద్దరి మధ్య 3వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
-
So Starc gets a wicket & at the same time 2948 kms Healy smacks a 4. Love watching them both!! pic.twitter.com/ANzWQNprre
— Lisa Sthalekar (@sthalekar93) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">So Starc gets a wicket & at the same time 2948 kms Healy smacks a 4. Love watching them both!! pic.twitter.com/ANzWQNprre
— Lisa Sthalekar (@sthalekar93) September 8, 2019So Starc gets a wicket & at the same time 2948 kms Healy smacks a 4. Love watching them both!! pic.twitter.com/ANzWQNprre
— Lisa Sthalekar (@sthalekar93) September 8, 2019
యాషెస్ తొలి మూడు టెస్టులకు దూరమైన స్టార్క్ నాలుగో మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టోను పెవిలియన్ పంపాడు. వెస్టిండీస్ ఆంటిగ్వా వేదికగా జరిగిన మహిళల వన్డేలో అలిస్సా 43 బంతుల్లో 58 పరుగులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను వ్యాఖ్యాత లీసా స్తలేకర్ ట్విట్టర్లో పంచుకుంది.
చిన్నతనం నుంచి స్నేహితులైన స్టార్క్ - అలిస్సా ఏప్రిల్ 2016లో వివాహం చేసుకున్నారు. యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై 185 పరుగుల తేడాతో గెలిచి 2-1 ఆధిక్యంలో నిలిచింది ఆసీస్.
ఇది చదవండి: క్రికెట్ గాడ్ తొలి సెంచరీకి 25 ఏళ్లు..