ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు శుభవార్త. ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఎస్ఆర్హెచ్లో చేరనున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత లీగ్‌కు దూరమయ్యాడు. దీంతో మార్ష్ స్థానంలో రాయ్‌ను జట్టులోకి తీసుకుంది హైదరాబాద్ జట్టు యాజమాన్యం.
గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా టోర్నీకి దూరమైన మార్ష్.. వ్యక్తిగత కారణాలతో ఈ సారి టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 2010లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మార్ష్.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లాడాడు.
-
Due to personal reasons, Mitchell Marsh will be opting out of #IPL2021.
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We would like to welcome @JasonRoy20 to the #SRHFamily! 🧡#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/grTMkVUns4
">Due to personal reasons, Mitchell Marsh will be opting out of #IPL2021.
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2021
We would like to welcome @JasonRoy20 to the #SRHFamily! 🧡#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/grTMkVUns4Due to personal reasons, Mitchell Marsh will be opting out of #IPL2021.
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2021
We would like to welcome @JasonRoy20 to the #SRHFamily! 🧡#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/grTMkVUns4
రాయ్.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను 2017లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. 2018లో దిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన రాయ్.. 179 పరుగులు సాధించాడు. ఇటీవల వేలంలో రాయ్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కు అతడ్ని దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. ఇటీవల భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో రాయ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
ఇదీ చదవండి: 30 మంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్