ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికారిగా నియమితులయ్యాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్లో విశిష్ట సేవలకుగాను క్లార్క్‌ను ఈ గౌరవం వరించింది. దీంతో మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్, స్టీవ్ వా సరసన నిలిచాడు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"నిజం చెప్పాలంటే ఈ వార్త వినగానే జూన్‌లో నన్ను ఏప్రిల్ ఫూల్ చేశారనిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ గౌరవాన్ని అందించినందుకు ధన్యవాదాలు"
మైకేల్ క్లార్క్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
ఇంతకు ముందు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని పొందిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో రికీ పాంటింగ్, మార్క్ టేలర్, అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్ తదితరులు ఉన్నారు. 2015 ప్రపంచకప్‌లో తమ దేశానికి కప్పు అందించిన క్లార్క్, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో 115 టెస్టుల్లో 8,643 పరుగులు, 245 వన్డేల్లో 7,981 పరుగులు, 34 టీ20ల్లో 488 పరుగులు చేశాడు.