ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​కు అడ్డుగా మరో రెండు టోర్నీలు - ఐసీసీ టీ20 ప్రపంచకప్​

ఆస్ట్రేలియాలో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్​కు మరో రెండు టోర్నీలు అడ్డుపడనున్నాయి. ఆ దేశంలో నిర్వహించే ఫుట్​బాల్​, రగ్బీ మ్యాచ్​లతో పోటీ పడనుందీ మెగాటోర్నీ. అయితే దీన్ని వాయిదా వేస్తారా.? యథావిధిగా నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Men's T20 World Cup 2020 organizers hopeful of success despite potential clash with other events
టీ20 ప్రపంచకప్​కు అడ్డుగా మరో రెండు టోర్నీలు
author img

By

Published : Apr 6, 2020, 8:55 AM IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి కరోనా వల్ల అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అందులో కీలకమైన ఐపీఎల్​-13 సీజన్​తో పాటు​ టీ20 ప్రపంచకప్​ టోర్నీలు ఉన్నాయి.

అస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​కు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. ఆ దేశంలో జరిగే మేజర్ క్రీడాటోర్నీలతో పాటు ప్రపంచకప్​ నిర్వహించటమనేది ఓ ఛాలెంజ్​గా భావిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా ఫుట్​బాల్​ లీగ్ ​(ఏఎఫ్​ఎల్​), నేషనల్​ రగ్బీ లీగ్​లు వాయిదా పడ్డాయి. దీంతో భవిష్యత్​లో ఈ మెగాటోర్నీలన్నీ ఘర్షణ పడే అవకాశం ఉంది.

"క్రికెట్​ను మా ప్రజలు ప్రేమిస్తారు. ఆస్ట్రేలియా జాతీయక్రీడా అదే. అంతే కాకుండా టీ20 ఫార్మాట్​ అనేది అందర్ని ఆకర్షించే టోర్నీ. ఇప్పటికే ప్రపంచకప్​ టోర్నీకి చాలా టికెట్లు అమ్ముడయ్యాయి. అందువల్ల ప్రణాళిక ప్రకారం ప్రపంచకప్​ను నిర్వహించాలనుకుంటున్నాం. అది జరగని పరిస్థితిలో మరొక మార్గాన్ని వెతుకుతాం."

-- నిక్​ హాక్లే

మహిళల టీ20 ప్రపంచకప్​ నిర్వాహణ విజయవంతమైన తరుణంలో పురుషుల టోర్నీ కూడా అదే ఉత్సాహంతో ప్రారంభించాలని క్రికెట్​ ఆస్ట్రేలియా ఆశిస్తోంది.

ఇదీ చూడండి.. యువరాజ్​ హృదయాన్ని కదిపిన వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.