ETV Bharat / sports

ఆసీస్​ పర్యటనతో ఎన్నో జ్ఞాపకాలు: రహానె - రహానె సెంచరీ స్పెషల్​

సొంత ఘనతలకంటే మ్యాచ్​, సిరీస్​ గెలవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానె. మెల్​బోర్న్​ టెస్టులో నమోదు చేసిన శతకం తనకెంతో ప్రత్యేకమైందని, సిరీస్​ విజయానికి అది బాటలు వేసిందని చెప్పాడు. ఆసీస్​ పర్యటన ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని వెల్లడించాడు.

rahaney
రహానె
author img

By

Published : Jan 25, 2021, 8:50 AM IST

ఆస్ట్రేలియా పర్యటన ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని టీమిండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. చివరి మూడు టెస్టుల్లో ఆఖరి వరకు జట్టుగా పోరాడాలనుకున్నామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. "అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బాగానే ఆడాం. కానీ ఒక గంట పేలవమైన ఆటతో మ్యాచ్ మారిపోయింది. ఆ తర్వాత ఆ ఓటమి గురించి చర్చించుకోలేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆఖరి నిమిషం వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం" అని అన్నాడు.

ఆసీస్​ పర్యటనలో మెల్​బోర్న్​ టెస్టులో తాను నమోదు చేసిన శతకం తనకెంతో ప్రత్యేకమైందని, సిరీస్​ విజయానికి అది బాటలు వేసిందని టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్య రహానె అన్నాడు. తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత పగ్గాలు అందుకున్నాడు రహానె.

"నా సొంత ఘనతలకంటే మ్యాచ్​, సిరీస్​ గెలవడానికే నా ప్రాధాన్యత. కానీ మెల్​బోర్న్​లో శతకం నాకెంతో ప్రత్యేకమైంది. లార్డ్స్​ శతకమే నాకెంతో ప్రత్యేకమైనదని మెల్​బోర్న్​లోనే చెప్పాను. కానీ నా లార్డ్స్ సెంచరీ కన్నా మెల్​బోర్న్​ సెంచరీ(112)నే మెరుగైందని చాలా మంది నాతో చెప్పారు. అందుకు ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు. కానీ అడిలైడ్​ టెస్టు తర్వాత పరిస్థితులను దృష్టిపెట్టుకుని చూస్తే మెల్​బోర్న్​ టెస్టు సిరీస్​కు ఎంతో కీలకమైంది. అక్కడ సెంచరీనే ప్రత్యేకమైందని నాకిప్పుడు అనిపిస్తోంది." అని రహానె అన్నాడు.

నాలుగు టెస్టుల్లో చోటు దక్కని స్పిన్నర్‌ కుల్‌దీప్ యాదవ్ గురించి జింక్స్‌ మాట్లాడుతూ.."కుల్‌దీప్ యాదవ్‌ ఎంతో ప్రతిభావంతుడు. కానీ అతడికి అవకాశం రాలేదు. ఆటగాళ్ల గాయాలు, జట్టు కూర్పు ఆలోచనలతో చోటు దక్కలేదు. జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. గతంలో అనుభవించా కూడా. అయితే కుల్‌దీప్‌ మ్యాచ్‌ విన్నర్‌. మా ఆటగాళ్లందరికీ జట్టును గెలిపించే సామర్థ్యం ఉంది. వాళ్లకి మద్దతు అవసరం" అని అన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రహానె ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది.

ఇదీ చూడండి : మా జీవితాల్లో అద్భుత క్షణాలు అవే: రహానె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.