పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో తొలిరోజు ఆధిపత్యం కొనసాగించింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగిన రోహిత్, 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో మయాంక్.. మరోసారి సెంచరీతో మెరిశాడు. పుజారా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం పుజారా (58).. రబాడ బౌలింగ్లో వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్ (108)ను ఔట్ చేసి సఫారీ జట్టులో ఆనందాన్ని నింపాడీ బౌలర్.
మయాంక్, రహానేలతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (63), రహానే (18) ఉన్నారు.
-
That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019
ఇవీ చూడండి.. 'పేసర్లు.. టీమిండియా క్రికెట్ రూపు మార్చారు'