బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో విజృంభించాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 304 బంతుల్లో రెండు వందల పరుగుల మార్కును అధిగమించాడు. ఇందులో 25 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
సిక్సర్‌తో డబుల్..
196 పరుగుల వద్ద మెహదీ హసన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేశాడు మయాంక్ అగర్వాల్. గతంలో సెహ్వాగ్ కూడా ఇదే మాదిరిగా సిక్సర్‌తో ద్విశతకం సాధించాడు.
టెస్టు కెరీర్లో ఇప్పటివరకు మూడు శతకాలు చేశాడు మయాంక్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగులు చేశాడీ టీమిండియా ఓపెనర్.
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(12) డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లల్లో మయాంక్ అగర్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో ద్విశతకం చేసిన వినోద్ కాంబ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్ సెమీ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్