టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడట. దక్షిణాది నటి అర్షితా శెట్టిని అతడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే డిసెంబర్ 2న, ముంబయిలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని సమచారం. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పడు ఇదే నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు తరఫున సత్తా చాటుతున్నాడు మనీశ్.
అర్షిత దక్షిణాది నటి. ముంబయికి చెందిన ఈ 26 ఏళ్ల ముద్దుగుమ్మ తుళు భాషలో 'తెళికేడా బొల్లి' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ఉదయం ఎన్హెచ్ 4' ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది. 'ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఇంద్రజిత్' చిత్రంలో అదరగొట్టింది.
మనీశ్, అర్షితల వివాహం అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. టీమిండియా సభ్యులూ.. ఈ పెళ్లికి హాజరుకానున్నారు.
ఇవీ చూడండి.. సెహ్వాగ్ తర్వాత మయాంక్దే ఆ రికార్డు