ఐకరాజ్య సమితి ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్లకు మనోవికాస తరగతులు నిర్వహించాడు సచిన్ తెందూల్కర్. ఇందుకోసం నేపాల్లో మూడు రోజులు పర్యటించాడు ఈ స్టార్ క్రికెటర్. యునిసెఫ్ ప్రచారకర్త అయిన సచిన్... నేపాల్ మహిళా క్రికెట్ జట్టుకు పాఠాలు చెప్పాడు.
-
नमस्ते Nepal 🇳🇵!
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy to be here in Kathmandu. Such a beautiful city! pic.twitter.com/YFTJwiXFZ2
">नमस्ते Nepal 🇳🇵!
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2019
Happy to be here in Kathmandu. Such a beautiful city! pic.twitter.com/YFTJwiXFZ2नमस्ते Nepal 🇳🇵!
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2019
Happy to be here in Kathmandu. Such a beautiful city! pic.twitter.com/YFTJwiXFZ2
ప్రధానికి ధన్యవాదాలు...
నేపాల్లో అడుగుపెట్టిన సచిన్ను.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ పశుపతి ఆలయాన్ని సందర్శించాడు సచిన్. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు.
" అనారోగ్యాన్ని లెక్కచేయకుండా నన్ను కలిసేందుకు వచ్చిన నేపాల్ ప్రధాని శ్రీ ఓలీ గారికి ధన్యవాదాలు. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నేపాల్లో అడుగుపెట్టగానే నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ ప్రేమాభిమానం నన్ను ఆకట్టుకుంది. మీ దేశ విలువలు ప్రపంచానికి ఓ మార్గదర్శకం".
-- సచిన్ తెందూల్కర్
2013 నవంబర్లో దక్షిణాసియా ప్రచారకర్తగా సచిన్ను ఎంపిక చేసింది యునిసెఫ్. ఆటల ద్వారా చిన్నారులు, మహిళల సాధికారతకు తోడ్పడుతున్నాడు ఈ దిగ్గజ క్రికెటర్.