ETV Bharat / sports

ప్రపంచకప్​ 'ఫిక్సింగ్' ఆరోపణలపై ప్రభుత్వం విచారణ - 2011 WORLD CUP NEWS

2011 ప్రపంచకప్​లో లంక జట్టు ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై విచారణకు ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం.

ప్రపంచకప్​ 'ఫిక్సింగ్' ఆరోపణలపై ప్రభుత్వం విచారణ
2011 ప్రపంచకప్
author img

By

Published : Jun 19, 2020, 9:11 PM IST

2011 వన్డే ప్రపంచకప్​ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రభుత్వం.. తక్షణ విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు ప్రస్తుత లంక క్రీడామంత్రి దుల్లాస్ అలహప్పెరుమా.

ఫైనల్​ల్లో లంక జట్టు కావాలనే ఓటమి పాలైందని, భారత్​కు కప్పు అమ్మేసిందని మహిందానంద అన్నారు. ఈ మాటల్ని కొట్టిపడేసిన మాజీ క్రికెటర్లు సంగక్కర, జయవర్ధనే.. ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పారు. మహిందానంద వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు.

2011 WORLD CUP
2011 ప్రపంచకప్​తో టీమ్​ఇండియా

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన లంక.. 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ వికెట్లు త్వరత్వరగా కోల్పోయిన సరే గంభీర్-ధోనీ జోడీ.. కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత టీమ్​ఇండియా ఈ మెగాటోర్నీలో విజేతగా నిలిచింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.