ETV Bharat / sports

భారత యువ క్రికెటర్​కు కరోనా.. ఆలస్యంగా వెలుగులోకి - కరుణ్ నాయర్ కరోనా

బ్యాట్స్​మన్ కరుణ్​ నాయర్​కు కరోనాను జయించాడు. అయితే వైరస్​ సోకి, తగ్గిన తర్వాతే ఈ విషయం బయటకొచ్చింది. త్వరలో ఇతడు ఐపీఎల్​ కోసం దుబాయ్ వెళ్లనున్నాడు.

భారత యువ క్రికెటర్​కు కరోనా.. ఆలస్యంగా వెలుగులోకి
భారత క్రికెటర్ కరుణ్​ నాయర్​
author img

By

Published : Aug 13, 2020, 2:26 PM IST

టీమ్​ఇండియాకు ఆడుతున్న యువ క్రికెటర్​ కరుణ్ నాయర్​కు కరోనా వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బయటకు చెప్పలేదు. రెండు వారాల క్రితమే ఈ ఆటగాడికి వైరస్ సోకిందని, ఇటీవలే ఆగస్టు 8న చేసిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు వెల్లడించింది. భారత జట్టుకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ క్రికెటర్​కు కరోనా సోకడం ఇదే తొలిసారి.

KXIP batsman Karun Nair
పంజాబ్ క్రికెటర్ కరుణ్ నాయర్

వైరస్​ నుంచి కోలుకోవడం వల్ల త్వరలో జరిగే ఐపీఎల్​ కోసం దుబాయ్​ వెళ్లనున్నాడు కరుణ్ నాయర్. ఇతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ తరఫున ఆడనున్నాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు టోర్నీ జరగనుంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్​ కోసం దుబాయ్ వెళ్లే వారందరికీ తొలుత ఇక్కడే రెండుసార్లు టెస్ట్​లు చేస్తారు. అక్కడికి వెళ్లిన వెంటనే మరోసారి, క్వారంటైన్​లో మరో రెండుసార్లు చేస్తారు. ఈ ఐదింటిలో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే బయో బబుల్​లోకి అనుమతిస్తారు.

Karun Nair IPL STATS
కరుణ్ నాయర్ ఐపీఎల్ గణాంకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.