ETV Bharat / sports

'బౌండరీ కౌంట్'​పై త్వరలో కుంబ్లే కమిటీ చర్చ - kumble

బౌండరీ కౌంట్​, ఇతర విషయాలపై చర్చించేందుకు అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో జరగనున్న సమావేశంలో ఈ విషయాలు చర్చించనున్నారు.

కుంబ్లే
author img

By

Published : Jul 29, 2019, 5:45 AM IST

2019 ప్రపంచకప్​ ఫైనల్​లో బౌండరీ కౌంట్ విధానం ఎంతో వివాదానికి దారి తీసింది. విజేతను ఈ విధంగా నిర్ణయించడాన్ని మాజీలు, క్రీడా విశ్లేషకుల తప్పుపట్టారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడనుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఐసీసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ.

"వరల్డ్​కప్ ఫైనల్​లో జరిగిన విషయాలపై ఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కుంబ్లే దీనికి అధ్యక్షత వహిస్తాడు. వచ్చే సమావేశంలో ఈ వివాదస్పద అంశాన్ని చర్చించనుందీ కమిటీ. సూపర్ ​ఓవర్లో ఫలితం తేలకపోతే బౌండరీ కౌంట్ విధానాన్ని 2009 నుంచి ఉపయోగిస్తున్నాం. దాదాపు అన్ని టీ 20 మ్యాచ్​ల్లో ఈ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. ఈ అంశంపై(బౌండరీ కౌంట్​) క్రికెట్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది" - జేఫ్ అలార్డైస్​, ఐసీసీ జనరల్ మేనేజర్.

జులై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లోనూ ఫలితం రాలేదు. ఈ కారణంగా బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు.

ఇది చదవండి: 'కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతాడు'

Hooghly (West Bengal), July 28 (ANI): Body of a Bharatiya Janata Party (BJP) worker Kashinath Ghosh was recovered from a canal in West Bengal's Hooghly district. The incident took place in Goghat village of Hooghly. Kashinath Ghosh was accused of being involved in the murder of Trinamool Congress (TMC) worker Lalchand Bagh. BJP has alleged that TMC is behind the murder of Ghosh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.