ETV Bharat / sports

'ఐసీసీ ఛైర్మన్​గా గంగూలీనే సరైన వ్యక్తి'

author img

By

Published : Jul 26, 2020, 12:25 PM IST

ఐసీసీ ఛైర్మన్​ పదవికి గంగూలీ సరైన వ్యక్తి అని చెప్పిన సంగక్కర.. ఆ లక్షణాలు దాదాలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. క్రికెట్​లో అతడు కచ్చితంగా మార్పు తీసుకురాగలడని ధీమా వ్యక్తం చేశాడు.

Kumar Sangakkara backs Sourav Ganguly for ICC Chairman post
గంగూలీ

ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీకి మద్దతుగా నిలిచాడు శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార్​ సంగక్కర. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే.. దాదా పరిపాలన, కోచింగ్​ విధానాన్ని తాను గమనించినట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్లతో ఏ విధంగా సత్సంబంధాలు పెంచుకోవాలో అతడికి బాగా తెలుసని అన్నాడు. ఐసీసీ ఛైర్మన్​ పదవికి సౌరభ్​ సరైన వ్యక్తని చెప్పడంలో సందేహమే లేదని స్పష్టం చేశాడు.

"సౌరభ్​ కచ్చితంగా క్రికెట్​లో మార్పు తీసుకురాగలడని నా నమ్మకం. క్రికెటర్​గా అతడి బ్యాటింగ్​ ప్రదర్శనకు మాత్రమే నేను అభిమాని కాదు. క్రికెట్​ పరంగా చురుకైన ఆలోచనలు ఉన్న వ్యక్తి గంగూలీ. దాదాకు ఆటపై అపారమైన ప్రేమ ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగానో, మరే ఇతర బోర్డు మెంబరుగానో ఉన్నంత మాత్రాన అది మారదు"

కుమార్​ సంగక్కర, శ్రీలంక క్రికెటర్​

అంతర్జాతీయ పాలక మండలికి అధ్యక్షత వహించే వ్యక్తి.. క్రికెట్​ పరంగా అన్ని దేశాల ప్రయోజనాల గురించి అవగాహన కలిగి ఉండాలని మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్​(ఎంసీసీ) తొలి నాన్​ బ్రిటిష్​ చీఫ్ తనతో​ చెప్పినట్లు వెల్లడించాడు సంగక్కర. "ఆ స్థానంలో కూర్చునే వ్యక్తి మనస్తత్వం సమానత్వంతో ఉండాలి. నేను ఏ దేశం నుంచి వచ్చాను అనే విషయంలో పక్షపాతం వహించకూడదు. నేను ఓ క్రికెటర్​.. ఏం చేసిన మొత్తం అన్ని దేశాల క్రికెటర్ల ప్రయోజనాల కోసమే చేయాలనే ఆలోచనతోనే ఉండాలి" అని సంగక్కర అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.