పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను మన్కడింగ్ పద్ధతిలో ఔట్ చేయకుండా హెచ్చరిండంపై ముంబయి ఆటగాడు కృనాల్‌ను అభిమానులు ప్రశంసించారు. అయితే చెన్నైతో మ్యాచ్‌లో ధోనికి కృనాల్ మన్కడింగ్ హెచ్చరిక చేశాడని కొందరు నెటిజన్లు అంటున్నారు.
-
Mankading MSD? Think again! https://t.co/g9G3Pa6uLL via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mankading MSD? Think again! https://t.co/g9G3Pa6uLL via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 4, 2019Mankading MSD? Think again! https://t.co/g9G3Pa6uLL via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 4, 2019
- చెన్నై ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేదార్ జాదవ్‌కు బౌలింగ్ చేస్తున్న కృనాల్.. యాక్షన్‌ను మధ్యలోనే ఆపి నాన్స్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న ధోనికి పరోక్షంగా మన్కడింగ్ హెచ్చరిక ఇచ్చినట్లు కనిపించాడు. ఆ సమయానికి ధోని బ్యాట్ క్రీజులోనే ఉంది. ఈ ఘటనపై అభిమానులు కృనాల్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు.
ధోని లాంటి తెలివైన, అత్యుత్తమ ఆటగాడిని నువ్వు మన్కడింగ్ చేయగలవా అంటూ కృనాల్‌పై విమర్శలు చేశారు కొందరు నెటిజన్లు. మన్కడింగ్ హెచ్చరిక ఇవ్వలేదు.. కావాలనే రన్నప్ మధ్యలోనే ఆపేశాడంటూ మరికొందరు అతడిని సమర్థించారు.