దిల్లీ 'ఫిరోజ్ షా కోట్లా' మైదానంలోని స్టేడియాన్ని అరుణ్ జైట్లీ పేరుతో పిలవనున్నారు. దిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) మంగళవారం ఈ నిర్ణయం ప్రకటించింది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గతంలో ఇదే సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
"విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషభ్ పంత్ వంటి ఎందరో ఆటగాళ్లు భారత జట్టులోకి రావడానికి జైట్లీ ఎంతగానో కృషి చేశారు. ఆయన డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే స్టేడియం ఆధునికీకరణ, వీక్షకుల గ్యాలరీలో సీట్ల సంఖ్య పెంపు నిర్ణయం, ప్రపంచస్థాయి డ్రెస్సింగ్ రూమ్‌ల నిర్మాణం జరిగాయి. జైట్లీ సేవలకు గుర్తుగా స్టేడియానికి ఆయన పేరును పెడుతున్నాం".
-- రజత్ శర్మ, దిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు
స్డేడియాన్ని( వీక్షకుల గ్యాలరీ, పెవిలియన్ ) మాత్రమే అరుణ్ జైట్లీ పేరుతో పిలవనున్నారు. గ్రౌండ్‌ను మాత్రం పాత పేరుతోనే పిలవనున్నట్లు రజత్ స్పష్టం చేశారు. ఈ తాజా ప్రతిపాదనను ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి...ప్రతిష్ఠాత్మక కోట్లా మైదానంలో విరాట్ కోహ్లీ స్టాండ్