ఇప్పటికే ఆడిన చెరో ఐదింటిలో గెలిచిన కోల్‌కతా, పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ గెలుపు చాలా అవసరం. మొదటగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
వరుసగా ఆరు మ్యాచ్‌ల ఓటమి అనంతరం ముంబయిపై గెలుపుతో కాస్త ఊరట లభించింది కోల్‌కతా జట్టుకు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన పంజాబ్ నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తాము కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నామని చెప్పాలనుకుంటోంది.
పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించే అవకాశం ఉంది. పిచ్‌పై తేమ సీమర్లకు అనుకూలిస్తుంది.
కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పంజాబ్ రెండు మార్పులు చేసింది. మిల్లర్, ముజిబర్ రహమన్ స్థానంలో సామ్ కరన్, ఆండ్రూ టై జట్టులో చోటు సంపాదించారు.
-
.@KKRiders win the toss and elect to bowl first against the @lionsdenkxip.#KXIPvKKR pic.twitter.com/cMJWHi1zxI
— IndianPremierLeague (@IPL) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@KKRiders win the toss and elect to bowl first against the @lionsdenkxip.#KXIPvKKR pic.twitter.com/cMJWHi1zxI
— IndianPremierLeague (@IPL) May 3, 2019.@KKRiders win the toss and elect to bowl first against the @lionsdenkxip.#KXIPvKKR pic.twitter.com/cMJWHi1zxI
— IndianPremierLeague (@IPL) May 3, 2019
జట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
కార్తీక్ (సారథి), సునిల్ నరైన్, క్రిస్ లిన్, శుభమన్ గిల్, ఊతప్ప, నితీష్ రానా, రసెల్, రింకూ సింగ్, పీయూష్ చావ్లా, సందీప్ వారియర్, హర్రీ గున్రే
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్ (సారథి), రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, సామ్ కరన్, సిమ్రన్ సింగ్, మురుగన్ అశ్విన్, షమీ, అర్షదీప్ సింగ్, ఆండ్రూ టై