ETV Bharat / sports

'కోహ్లీ రనౌట్​.. మ్యాచ్​ గతినే మార్చే సంఘటన'

తొలి టెస్టులో కోహ్లీ రనౌట్​పై ఆసీస్ స్పిన్నర్ లైయన్ స్పందించాడు.​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలిరోజు పూర్తయ్యేసరికి 233/6 స్కోరుతో నిలిచింది టీమ్​ఇండియా.

kohli run out news
కోహ్లీ రన్​ ఔట్​ భారీ పరిణామం: నాథన్​
author img

By

Published : Dec 17, 2020, 8:29 PM IST

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ రనౌట్​ మ్యాచ్​ గమనాన్నే మార్చేసిందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ చెప్పాడు. విరాట్​, పుజారా లాంటి ఆటగాళ్లకు బంతులేయడం సవాల్​ లాంటిదని అన్నాడు.

Nathan Lyon
నాథన్​

"కోహ్లీ చాలా అద్భుతంగా బ్యాటింగ్​ చేశాడు. కానీ అతడు రనౌట్​ కావడం అనుహ్య పరిణామం. విరాట్​, పుజారా లాంటి గొప్ప ఆటగాళ్లను ఎదుర్కోవడం ఓ సవాల్​. స్పిన్​ బౌలింగ్​ను ఆడటంలో వారిద్దరి బ్యాటింగ్​ శైలి విభిన్నంగా ఉంటుంది. ఈ రోజు మా ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. బౌలింగ్​ అద్భుతంగా చేశారు. అయినప్పటికీ మా ప్రదర్శన మరింత మెరుగుపరుచుకోవాలి"

-నాథన్​ లైయన్​, ఆసీస్​ స్పిన్నర్​

తమ జట్టులో కామెరూన్​ గ్రీన్​, మిచెల్​ స్టార్క్​ బాగా ఆడారని కితాబిచ్చాడు లైయన్​. వారి ప్రదర్శనకు ముగ్ధుడైనట్లు తెలిపాడు. ఈ మ్యాచ్​లో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సాహా, అశ్విన్ క్రీజులో ఉన్నారు. అడిలైడ్ వేదికగా పోరు జరుగుతోంది.

ఇదీ చూడండి : కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ 233/6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.