టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి మరోసారి ఎంపికయ్యాడు. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిభాయ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక అనంతరం కపిల్ మాట్లాడుతూ.. శాస్త్రికి కోహ్లీ మద్దతు తెలిపినా.. అది మా నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని తెలిపాడు.
"కోహ్లీ మాటలు కోచ్ ఎంపికను ప్రభావితం చేయలేదు. అతడి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుంటే మిగతా ఆటగాళ్ల సూచనలు పరిశీలించాలి. మే ఎవ్వరినీ అడగలేదు. అందుకు ఆస్కారం లేదు. ప్రపంచకప్ గెలవనంత మాత్రాన ఓ మేనేజర్ని తీసిపారేయలేం. అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం".
-కపిల్ దేవ్, సీఏసీ సభ్యుడు
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మిగతా వారితో పోలిస్తే రవిశాస్త్రి రికార్డు బాగుండటమే అతడిని ఆ పదవికి అర్హుడయ్యేలా చేసింది. టెస్టుల్లో జట్టును నంబర్ వన్‌గా నిలపడం, ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ గెలవడం రవిభాయ్‌కు పేరు తెచ్చాయి.
"అందరూ ప్రతిభావంతులే. కొన్ని సార్లు రవిశాస్త్రి మిగతావారి కంటే ఎక్కువ మార్కులు సంపాందించాడు. అందరి ప్రెజెంటేషన్స్ చూశాకే కోచ్‌ను ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టుతో ఉండటం శాస్త్రికి కలిసొచ్చింది. టీం బలాబలాలు అతడికి బాగా తెలుసు".
-కపిల్ దేవ్, సీఏసీ సభ్యుడు
కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో మాజీ టీమిండియా ఆటగాళ్లు రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, కివీస్ మాజీ ఆటగాడు మైక్ హెసన్, ఆస్ట్రేలియన్ టామ్ మూడీకి నిరాశే మిగిలింది.
ఇవీ చూడండి.. టీమిండియా కోచ్: రవి భాయ్‌కే మళ్లీ పట్టం