ETV Bharat / sports

కెప్టెన్ కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాల సెగ?

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరోసారి పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్నాడు. భారత జట్టు కిట్​ స్పాన్సర్​గా ఉన్న మొబైల్​ ప్రీమియర్​ లీగ్​ (ఎంపీఎల్​) సంస్థలో కోహ్లీకి వాటా ఉందనే విషయమే దీనికి కారణమైంది.

Kohli's Personal Investment Raises Conflict of Interest: Report
మొబైల్​ ప్రీమియర్​ లీగ్​ సంస్థలో కోహ్లీ పెట్టుబడులు?
author img

By

Published : Jan 6, 2021, 12:41 PM IST

Updated : Jan 6, 2021, 1:39 PM IST

ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల వివాదంలో మరోసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుకున్నాడు. ప్ర‌స్తుతం భారత జట్టు కిట్ స్పాన్స‌ర్‌గా ఉన్న మొబైల్ ప్రీమియ‌ర్ లీగ్ (ఎంపీఎల్‌) సంస్థ‌లో కోహ్లీ పెట్టుబడులు ఉండ‌ట‌మే ఈ వివాదానికి కార‌ణ‌మైంది.

గ‌తేడాది జ‌న‌వ‌రిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కోహ్లీని నియమించారు. అప్పట్లోనే అతని పేరిట రూ.33.32 ల‌క్ష‌ల విలువైన‌ 68 సీసీడీల‌ను కేటాయించారని సమాచారం. వీటిని ప‌దేళ్ల త‌ర్వాత ఈక్విటీ షేర్ల‌లోకి మార్చుకోవ‌చ్చని తెలుస్తోంది. దీంతో ఈ కంపెనీలో కోహ్లీకి 0.051 శాతం వాటా ఉన్న‌ట్లే. ఇదే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ను గతేడాది నవంబ‌ర్ 17న అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా బీసీసీఐ ప్ర‌క‌టించింది.

ఎంపీఎల్​ను మూడేళ్ల పాటు బీసీసీఐ అధికారిక కిట్​ భాగస్వామిగా ప్రకటించిన తర్వాత.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఆ సంస్థ లోగో ఉన్న జెర్సీలను టీమ్​ఇండియా ఆటగాళ్లు ధరించారు. మూడేళ్ల పాటు ఈ సంస్థ‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఎంపీఎల్​లో కోహ్లీకి వాటా ఉన్నట్లు తెలియదని బీసీసీఐ చెబుతోంది.

కోహ్లీ లాంటి స్టార్​ ఆటగాడు.. ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడడం సరికాదని క్రికెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని గతేడాది ఎథిక్స్​ అధికారి డీకే జైన్​ లేవనెత్తారు. అయితే దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదీ చూడండి: టెస్టు సిరీస్​ క్లీన్​స్వీప్​.. ర్యాంకింగ్స్​లో కివీస్​దే అగ్రస్థానం

Last Updated : Jan 6, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.