క్రికెట్లో భారత బ్యాటింగ్ ప్రదర్శనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినవాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. తన 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. అలాంటి దిగ్గజం సృష్టించిన రికార్డులను తిరగరాస్తూ సత్తా చాటుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ... అరడజనుకు పైగా రికార్డులు చెరిపేశాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ 24 ఏళ్ల కెరీర్లో ఆరు డబుల్ సెంచరీలు సాధిస్తే.. మూడేళ్ల వ్యవధిలో ఏడు డబుల్ సెంచరీలతో ఆ రికార్డును అధిమించేశాడు విరాట్. 40 టెస్టుల వ్యవధిలో ఏడుసార్లు 200 పైచిలుకు వ్యక్తిగత స్కోర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే కోహ్లీ ఆటతీరుకు మరోసారి ముగ్ధుడైన లిటిల్ మాస్టర్... ట్విట్టర్లో అభినందించాడు.
-
Congrats to @imVkohli on his double hundred and @mayankcricket for his hundred. Well played guys. Keep it up!#INDvsSA pic.twitter.com/FBJ30l911E
— Sachin Tendulkar (@sachin_rt) October 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congrats to @imVkohli on his double hundred and @mayankcricket for his hundred. Well played guys. Keep it up!#INDvsSA pic.twitter.com/FBJ30l911E
— Sachin Tendulkar (@sachin_rt) October 11, 2019Congrats to @imVkohli on his double hundred and @mayankcricket for his hundred. Well played guys. Keep it up!#INDvsSA pic.twitter.com/FBJ30l911E
— Sachin Tendulkar (@sachin_rt) October 11, 2019
21వేల మైలురాయి...
254* రన్స్‌తో చెలరేగిన కోహ్లీ... సచిన్ ఖాతాలోని మరో రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 21వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ కంటే 38 ఇన్నింగ్స్‌ల ముందే ఈ ఘనత అందుకున్నాడు విరాట్.
లిటిల్ మాస్టర్ రికార్డులు ఊదేశాడు...
- ఏడు వేల పరుగులు పూర్తి చేయడానికి కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు 138. వాలీ హేమండ్ (131 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ (136)ల తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మన్ కోహ్లీనే. గ్యారీ సోబర్స్, కుమార సంగక్కర కూడా 138 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించారు.
- టెస్టుల్లో విరాట్ డబుల్ సెంచరీల సంఖ్య 7. మాజీ క్రికెటర్లు సచిన్ (6), సెహ్వాగ్ (6)లను అధిగమించి అత్యధిక ద్విశతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా టెస్టుల్లో డాన్ బ్రాడ్‌మన్ (12), సంగక్కర (11), బ్రయాన్ లారా (9) మాత్రమే విరాట్ కన్నా ముందున్నారు.
- ఈ మ్యాచ్‌లో కోహ్లి స్కోరు 254 నాటౌట్. దక్షిణాఫ్రికాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఓ భారత కెప్టెన్ అత్యధిక స్కోరు ఇదే. 1996లో సచిన్ సాధించిన 169 పరుగులే ఇప్పటిదాకా అత్యధికం. 2012లో దక్షిణాఫ్రికాపై మైకేల్ క్లార్క్ డబుల్ సెంచరీ చేశాక, ఆ జట్టుపై ఈ ఘనత అందుకున్న బ్యాట్స్‌మన్ కోహ్లీనే.
జట్టులో మిగతా బ్యాట్స్‌మన్ అంతా కలిసి మూడు డబుల్ సెంచరీలు చేసిన కాలంలో... ఏడుసార్లు 200 స్కోరును కొట్టేసి తన ప్రతిభ నిరూపించుకున్నాడు కోహ్లీ.
ఇవీ చూడండి...