క్రికెట్లో విరాట్ కోహ్లీని టెన్నిస్ ఆటగాడు ఫెదరర్‌తో, స్టీవ్ స్మిత్‌ను రఫెల్ నాదల్‌తో పోల్చవచ్చని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఫెదరర్‌లాగే కోహ్లీలో సహజ సామర్థ్యం ఎక్కువని, మానసిక ధైర్యంలో స్మిత్, నాదల్‌ను పోలి ఉంటాడని చెప్పాడు. జింబాబ్వే మాజీ ఆటగాడు పోమ్మీ ముబాంగ్వ జరిగిన ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో ఈ బ్యాట్స్మెన్ల గురించి మాట్లాడాడు.
"టెన్నిస్ క్రీడాకారులతో పోలిస్తే.. కోహ్లీ తన సహజసిద్ధమైన ప్రదర్శనతో రోజర్ ఫెదరర్‌ను మరిపిస్తాడు. స్టీవ్ స్మిత్ మైదానంలో మానసికంగా చాలా బలంగా కనిపిస్తాడు. స్మిత్.. రఫెల్ నాదల్‌లా అనిపిస్తాడు. స్మిత్ సహజసిద్ధంగా ఆడకపోయినా రికార్డులను నెలకొల్పతున్నాడు."
-డివిలియర్స్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్
ఛేజింగ్‌లో కోహ్లీకి, తనకు తెందూల్కర్ ఆదర్శమన్నాడు డివిలియర్స్. క్రీజ్‌లో అతడు నిర్విరామంగా నిలబడే విధానాన్ని అనుసరిస్తామన్నాడు. కోహ్లీ, తాను మంచి స్నేహితులమని.. అతని భార్య అనుష్క శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపాడు.
ఇదీ చూడండి.. 'మరోసారి ఇలా చేస్తే చంపేస్తా అన్నాడు'