ETV Bharat / sports

భారత కెప్టెన్ కోహ్లీ దంపతులకు ఆడపిల్ల - కోహ్లీ అనుష్క దంపతులకు ఆడపిల్ల

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోమవారం ఆడ శిశువును ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా కోహ్లీ వెల్లడించాడు.

Kohli, Anushka Sharma Couple has blessed with a baby girl
కోహ్లీ, అనుష్క శర్మ
author img

By

Published : Jan 11, 2021, 4:22 PM IST

Updated : Jan 11, 2021, 4:45 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతడి సతీమణీ అనుష్క శర్మ సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా పంచుకున్న కోహ్లీ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు.

"ఈ మధ్యాహ్నం మా జీవితంలోకి పాప అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మా గోప్యతకు మీరంతా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను"

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. వన్డే సిరీస్, టీ20 సిరీస్​తో పాటు టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​ అనంతరం స్వదేశానికి తిరిగొచ్చేశాడు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా కెప్టెన్​కు అశ్విన్​ స్వీట్​ వార్నింగ్​!

Last Updated : Jan 11, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.