ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఆటగాడిగా పేరున్న వివ్ రిచర్డ్స్, భారత జట్టు ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పలు విషయాలను పంచుకున్నారీ ఇద్దరు ఆటగాళ్లు. పేసర్ల చేతిలో బ్యాట్స్‌మెన్ గాయపడటంపై వీరిద్దరూ విభిన్నంగా స్పందించారు.
-
Special: @imVkohli in conversation with @ivivianrichards (Part 1)
— BCCI (@BCCI) August 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
King Kohli turns anchor and quizzes the Caribbean Master to understand his fearless mindset - by @28anand
Full interview 🎥 - https://t.co/HHGvlzfFEi pic.twitter.com/ikl7oifKSi
">Special: @imVkohli in conversation with @ivivianrichards (Part 1)
— BCCI (@BCCI) August 22, 2019
King Kohli turns anchor and quizzes the Caribbean Master to understand his fearless mindset - by @28anand
Full interview 🎥 - https://t.co/HHGvlzfFEi pic.twitter.com/ikl7oifKSiSpecial: @imVkohli in conversation with @ivivianrichards (Part 1)
— BCCI (@BCCI) August 22, 2019
King Kohli turns anchor and quizzes the Caribbean Master to understand his fearless mindset - by @28anand
Full interview 🎥 - https://t.co/HHGvlzfFEi pic.twitter.com/ikl7oifKSi
"బంతి ఎప్పుడు తగులుతుందా అని భయపడుతూ ఉండటం కంటే, దెబ్బతిని నొప్పిని భరించటమే మంచిది. ప్రత్యర్థులపై మరింత కసితో ఆడటానికి ఆ బాధే ఆయుధం అవుతుంది. నొప్పి అనుభవిస్తున్నప్పుడు ఇంకోసారి ఇలా జరగదు కదా అనిపిస్తుంది".
-విరాట్ కోహ్లీ, భారత క్రికెటర్
ఎలాంటి పేసర్‌ను అయినా బెదురు లేకుండా ఎదుర్కొనడంలో రిచర్డ్స్ దిట్ట. అదే విధంగా దెబ్బలనేవి ఆటలో భాగమని తెలిపాడు.
"ఆటలో దెబ్బతిన్నాక ఏ విధంగా ఆడతామనేదే ముఖ్యం. ఒకప్పుడు ఛాతి భాగంలో చిన్న గాడ్స్ ఉండేవి. బంతి తగిలితే బాధపడేవాళ్లం. ఏదేమయినా ఇవన్నీ ఆటలో ఓ భాగమని గుర్తుంచుకోవాలి ".
-వివ్ రిచర్డ్స్ , వెస్టిండీస్ మాజీ క్రికెటర్
ఇప్పటి బ్యాట్స్‌మెన్‌కు రిచర్డ్సే ఆదర్శమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తామిద్దరి ఆటలో పోలికలున్నాయని వివ్ స్పష్టం చేశాడు.
"పోటీకి నేనెప్పుడూ సిద్ధంగా ఉండేవాడిని. నా ఆటలో నేను అత్యుత్తమంగా ఉండాలని అనుకునేవాడిని. అలాంటి తీరే నీలో(కోహ్లీ) చూస్తున్నా. కొందరు మాత్రం నీలో కోపాన్ని మాత్రమే చూస్తారు.. ఎందుకంత కోపం అని ప్రశ్నిస్తారు".
-వివ్ రిచర్డ్స్ , వెస్టిండీస్ మాజీ క్రికెటర్
మంచి బౌలర్లు ఉన్న సమయంలోనూ మీరెందుకు హెల్మెట్లు వాడలేదంటూ రిచర్డ్స్‌ను ప్రశ్నించాడు కోహ్లీ.
"నేను చాలా గొప్పవ్యక్తినని నమ్మేవాడిని. చూసేవాళ్లు నాకు పొగరని అనుకొవచ్చు. కానీ అది ఆటలో భాగమని నేను భావిస్తా. హెల్మెట్ నాకు అసౌకర్యంగా అనిపించేది. ఎరుపు రంగు టోపీ మాత్రం ధరించేవాడిని. ఆ సమయంలో గొప్పగా అనిపించేది. బాగా ప్రదర్శన ఇవ్వాలి అనుకున్నప్పడు దెబ్బలకు సిద్ధమయ్యేవాడిని. బాగా ఆడాలనే ఆలోచనతో మాత్రమే ఉండేవాడిని. ఒకవేళ దెబ్బలు తిన్నా.. దేవుడి దయ వల్ల సులభంగానే బయట పడేవాడిని. -వివ్ రిచర్డ్స్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
ఇది చదవండి: విరాట్, బుమ్రాల సిక్స్‌ప్యాక్ పిక్.. యువీ ప్రశంసలు