ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం కేకేఆర్ తయార్.. క్వారంటైన్​లో ఆటగాళ్లు - కేకేఆర్ క్వారంటైన్​

ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం సిద్ధమవుతోంది కోల్​కతా నైట్​రైడర్స్. ఈ సీజన్​ కోసం కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండనున్నారు. తాజాగా కోల్​కతా నైట్​రైడర్స్ వారి క్వారంటైన్​ను ప్రారంభించింది.

KKR
కేకేఆర్
author img

By

Published : Mar 22, 2021, 9:20 AM IST

ఏప్రిల్ 9న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు సాధనకు సన్నద్ధం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ముందుగా ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండనున్నారు. ఇప్పటికే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ చేయగా.. మిగతా జట్లు ఆ దారిలోనే పయనమవుతున్నాయి. తాజాగా కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు ఆటగాళ్లు వారి క్వారంటైన్​ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

కేకేఆర్ మాజీ సారథి దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, కమలేశ్ నాగర్​కోటి, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఫొటోలను పంచుకుంటూ 'కొత్త సీజన్ కోసం ఇది క్వారంటైన్ సమయం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

గతేడాది ఎన్నో అంచనాలతో బరిలో దిగిన కేకేఆర్ అనుకున్నంతగా రాణించలేకపోయింది. దీంతో లీగ్ మధ్యలోనే దినేశ్ కార్తీక్​ను కెప్టెన్​గా తప్పించి ఇయాన్ మోర్గాన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ప్రస్తుతం ఇతడు టీమ్ఇండియాతో జరగబోతున్న వన్డే సిరీస్​లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే బయో బబుల్ వాతావరణంలో ఉండటం వల్ల మోర్గాన్ నేరుగా జట్టుతో కలవనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.