ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆ జట్టుకే: పీటర్సన్ - delhi capitals

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న జరగబోయే ఐపీఎల్​ ట్రోఫీని దిల్లీ క్యాపిటల్స్​ దక్కించుకోవాలని కోరుకుంటున్నట్లు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ కెవిన్​ పీటర్సన్​ పేర్కొన్నాడు. గతంలో అనేక ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు పీటర్సన్.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 12, 2020, 7:12 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో శ్రేయస్​ అయ్యర్​ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రోఫీని గెలవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ కెవిన్​ పీటర్సన్​ తెలిపాడు. ఈ క్రమంలోనే తన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్​ చేసి.. "ఇంగ్లాండ్​ బబుల్​ నుంచి దుబాయ్​లో ఏర్పాటు చేసిన బబుల్​ వరకు. మళ్లీ క్రికెట్​ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్​లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఈ సారి దిల్లీ కప్పు సాధిస్తుందని ఆశిస్తున్నా" అంటూ రాసుకొచ్చాడు.

ipl
ఐపీఎల్​లో దిల్లీ ఇప్పటి వరకు దక్కించుకున్న స్థానాలు

పీటర్సన్​ గతంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, దిల్లీ డేర్​డెవిల్స్​, రైజింగ్​ పుణె వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు శ్రేయస్​ అయ్యర్​ నాయకత్వం వహిస్తుండగా.. రవిచంద్రన్ అశ్విన్​, అజింక్యా రహానె వంటి ఆటగాళ్ల చేరికతో జట్టుకు మరింత బలం చేకూరినట్లైంది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. కాగా, దుబాయ్​లో 24 మ్యాచ్​లు నిర్వహించనుండగా.. అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్​లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.