ETV Bharat / sports

29 ఏళ్ల క్రితమే టెస్టుల్లో కపిల్ సిక్సర్ల రికార్డు - england

లార్డ్స్​ వేదికగా 29 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ క్రికెట్ దిగ్గజం కపిల్​దేవ్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. టెస్టు క్రికెట్​లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన ఈ మ్యాచ్​లో టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే 24 పరుగులు అవసరమవగా వరుస సిక్సర్లు బాదాడు కపిల్.

కపిల్ దేవ్
author img

By

Published : Jul 30, 2019, 10:34 AM IST

పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా సిక్సర్లు కొట్టడం చాలాసార్లు చూసుంటాం. టెస్టు క్రికెట్​లో మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఐదు రోజుల క్రికెట్లో వరుసగా 4 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్​మన్ ఎవరో తెలుసా! ఇంకెవరు అది భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. 1990 జులై 30న ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్​లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది టీమిండియాను ఫాలో ఆన్ ముప్పు నుంచి రక్షించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 653 పరుగుల చేసి డిక్లేర్ ఇచ్చింది. కెప్టెన్ గ్రాహమ్ గూచ్ 333 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమిండియా బ్యాట్స్​మెన్​లో రవిశాస్త్రి(100), అజారుద్దీన్(101) శతకాలతో ఆకట్టుకున్నారు. అయితే పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయిన భారత బ్యాట్స్​మెన్ 9 వికెట్లు కోల్పోయి 430 పరుగుల చేశారు.

కపిల్ సిక్సర్ల సునామీ..

టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే 24 పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజులో ఒక ఎండ్​లో కపిల్ దేవ్ ఉండగా.. మరో ఎండ్​లో హిర్వాణీ ఉన్నాడు. ఇంగ్లీష్ బౌలర్ హెమ్మింగ్స్​ వేసిన ఓవర్లో కపిల్​ తొలి రెండు బంతులకు పరుగులేమి చేయలేదు. తర్వాత నాలుగు బంతులకు 4 సిక్సర్లు కొట్టి ఇంగ్లీష్ జట్టును ఆశ్చర్యపరిచాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లాంగ్ ఆన్ దిశగా.. స్టైట్​గా సిక్సర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్​కు చెమటలు పట్టించాడు. తర్వాతి ఓవర్లో హిర్వాణీ.. ప్రేజర్ బౌలింగ్​లో ఔట్​ కావడంతో భారత ఇన్నింగ్స్​ ముగిసింది. అప్పటికే 24 పరుగులు రావడం వల్ల భారత్ ఫాలో ఆన్​ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్​లో కపిల్ 75 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 272 పరుగులకు డిక్లేర్ ఇచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్​లో తడబడిన టీమిండియా 247 పరుగులు భారీ తేడాతో పరాజయం పాలైంది. అయితే కపిల్ నాలుగు సిక్సర్లను మాత్రం క్రికెట్ ప్రియులు అంత త్వరగా మర్చిపోలేరు. 29 ఏళ్ల క్రితం ఇదే రోజున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్​గా కపిల్ రికార్డు సృష్టించాడు.

ఇది చదవండి: 'దీపా ఒలింపిక్స్​ పర్యటనపై ఇప్పుడే ఏం చెప్పలేం'

AP Video Delivery Log - 0300 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0256: Pakistan Plane Crash AP Clients Only 4222744
Pakistani army plane crashes into homes
AP-APTN-0238: Brazil Prison Riot No access Brazil 4222743
Officials say 57 dead in Brazil prison riot
AP-APTN-0132: Hong Kong Station Protest AP Clients Only 4222741
Protesters disrupt Hong Kong's rail system
AP-APTN-0128: STILLS Pakistan Plane Crash AP Clients Only 4222742
Small plane crashes in Pakistan, killing at least 12
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.