ETV Bharat / sports

కోహ్లీ కన్నా ముందే కేన్​కు పితృత్వ సెలవులు - వెస్టిండీస్​ మ్యాచ్​కు దూరం కానున్న విలియమ్సన్

భారత జట్టు కెప్టెన్​ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్​. తండ్రి కాబోతున్న సందర్భంగా పితృత్వపు సెలవులు తీసుకుని వెస్టిండీస్​తో జరగాల్సిన రెండో టెస్టుకు దూరం అవుతున్నాడని న్యూజిలాండ్ కోచ్​ వెల్లడించాడు.

Kane Williamson
కోహ్లీ బాటలోనే కేన్‌ విలియమ్సన్‌!
author img

By

Published : Dec 11, 2020, 6:54 AM IST

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ బాటలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియ్సమన్‌ నడుస్తున్నట్లు ఉన్నాడు. కోహ్లీ సతీమణి అనుష్కశర్మ జనవరిలో తల్లికాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు తర్వాత వైదొలుగుతున్నాడు. అదే కారణంతో కివీస్‌ సారథి విలియమ్సన్‌ ఇప్పుడు వెస్టిండీస్‌తో ఆడాల్సిన రెండో టెస్టుకు దూరం అవుతున్నాడని ఆ జట్టు కోచ్‌ గ్యారీస్టెడ్‌ గురువారం ఒక వీడియోలో పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ టీమ్‌ ట్విటర్‌లో దాన్ని విడుదల చేసింది. విలియమ్సన్‌ సతీమణి సారా రహీమ్‌ కొద్దిరోజుల్లో తొలిసారి మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుందని, ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 11 నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో అతడు ఆడటం లేదని కోచ్‌ పేర్కొన్నాడు.

విలియమ్సన్‌ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నాడని, అతడి స్థానంలో ఇటీవలే అరంగేట్రం చేసిన విల్‌యంగ్‌ ఆడతాడని చెప్పాడు. ఇక జట్టు బాధ్యతలు టామ్‌ లాథమ్‌కు అప్పగించినట్లు వివరించాడు. ఇదిలా ఉండగా, గతవారం జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 134 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విలియమ్సన్‌ (251; 412 బంతుల్లో 34x4, 2x6) ద్విశతకంతో చెలరేగడంతో కివీస్‌ 519/7 స్కోర్‌ సాధించింది. అనంతరం విండీస్‌ 138, 247 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌ సారథి టెస్టుల్లో విరాట్‌ కోహ్లీ సరసన చేరాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ 911 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కోహ్లీ, విలియమ్సన్‌ 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఇదీ చదవండి:యువ ఆటగాళ్ల కోసం 'ఆనంద్​' చెస్​ అకాడమీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.